🙏MBBS చదువు విషయమై కొందరికి సమాధానం: 👉మెడికల్ ఎడ్యుకేషన్ మూడు రకాల వాళ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది
👉1)ధనాపేక్ష లేకుండా కేవలం మానవసేవ చెయ్యాలన్న కోరిక నరనరాల్లో ఉన్న పిల్లలకు.
(తలిదండ్రులు, ఇరుగుపొరుగు సృష్టించిన కోరిక ఇంజెక్షన్లతో ఎక్కించింది, అది వేరు).
ధనవంతులయిన రాజు కుటింబీకులకు వారి సొంత గ్రామ ప్రజలకు ఆయుర్వేద వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని కలిగించాలని కోరిక కలదు. తన కూతురు సమత దగ్గర తన అభిప్రాయం తెలియజేయగా ఆమె కూడా అదే ఆలోచన ధోరణిలో ఉండడం చే సరేనని ఒప్పుకుంది. మద్రాసు లోని ఆయుర్వేద కళాశాలనుంచి ఆయుర్వేదం లో డిగ్రీ పూర్తీ చేసింది. తన ఊరిలో వైద్యం మొదలు పెట్టి పేదలకు ఉచితంగా, మిగతా వారికి కొంత మొత్తం తో వైద్యం చేస్తూ తన ఆరోగ్యం ఊరిలోని వారి ఆరోగ్యాలు చూసుకొంటూ సహాయపడుతోంది.
👉2)చదువులు పూర్తయ్యేవరకూ రోజుకు కనీసం 12-15 గంటలు కూర్చొని చదివే ఓపిక/పట్టుదల ఉన్న పిల్లలకు : రవిశేఖర్ వాళ్ళ నాన్న సాధారణ ప్రయివేట్ ఉద్యోగి. వారి కుటుంబం ఉమ్మడి కుటుంబం. రవి కి డాక్టర్ కావాలని పట్టుదల ఎక్కువగా ఉండేది. ఇంటర్ చదివిన తరువాత EAMCET రాశాడు ఎనిమిది వేల ర్యాంక్ వచ్చింది. సీట్ రాలేదు. అతను తన లక్ష్యాన్ని పక్కన పెట్టలేదు. విజయం సాధించే వరకు పోరాడాడు. కోచింగ్ కు వెళ్లారు, దీనికి 3 సంవత్సరాల వ్యవధి పట్టింది. ప్రస్తుతం అతను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు.
👉3)ఏకసంతాగ్రహులకు. నిజంగా అదో గొప్ప ప్రొఫెషన్. అవును, కొంతమంది విద్యార్థులు అలాంటివారు ఉంటారు. 😩మనకు ఆరోగ్యం బాలేనప్పుడు డాక్టరుగారి విలువ మనం గుర్తిస్తాము 🤓కానీ డబ్బు/స్టేటస్ సంపాదించడానికి, జీవితం ఎంజాయ్ చేయడానికి ఇది ఎంతమాత్రమూ సరైన ప్రొఫెషన్ కాదు. 🙌
👍 కారణాలు:
😵మరీ ఇంటెలిజెంట్ పిల్లల విషయం పక్కన పెడితే నీట్ క్లియర్ చేయడానికి 12th తర్వాత ఓ రెండేళ్లు పడుతుంది. 🤝తర్వాత లెక్కకు ఓ 5½ సంవత్సరాలు MBBS పూర్తిచేయడానికి అవుతుంది. కానీ ప్రాక్టికల్ గ చుస్టే ఓ 6-6½ సంవత్సరాలు ఖర్చయిపోతుంది. 😁😁😁😄😃ఇక మొదలవుతుంది బంధువుల ప్రశ్నలు “ఏంటి నువ్వు కేవలం MBBS డాక్టరువేనా పీజీ చేయలేదా?”. ఇక పీజీ సీట్ కొట్టడానికి 1-2 ఏళ్ళు ఆహుతైపోతది. ఆతర్వాత పీజీలో ఓ రెండేళ్లు. ఇక్కడ అన్నింటికంటే పనికిమాలిన పని విపరీతమైన ఒత్తిడితో కూడుకున్న జీవితం. 🎆థెసీస్ సబ్మిట్ చేసే పేరుతో డిప్పమీద మిగిలిన నాలుగు వెంట్రుకలూ రాలిపోతాయి, 🥸కనబడ్డ ప్రతి సీనియర్ కు, ప్రొఫెసర్లకు సలాం కొట్టి కొట్టి వెన్నెముక కాస్తా వంగిపోతుంది. అంటే 12th తర్వాత దాదాపు ఓ12 ఏళ్ళు స్వాహా! ఆ తర్వాత DM/MCh చెయ్యాలా వద్దా అని తర్జన భర్జనలో ఇంకో సంవత్సరం పాయే. ఇప్పుడు అంటే దాదాపు 30-31 ఏళ్ల వయసులో ఓ కొత్త డాక్టరు క్లినిక్ పెట్టుకుంటాడు. 👨⚕️
😷ఇంకో రెండు సంవత్సరాలలో జ్ఞానోదయం అవుతుంది…ఇప్పుడు పేషంట్లు క్లినిక్కులకు వెళ్ళరు, పెద్ద హాస్పిటల్ ఉంటేనే వస్తారు అని. అప్పుడు ఓ 5-6 కోట్లు లోన్ తీసి హాస్పిటల్ కడతాడు. 👋ఆ హాస్పిటల్ ప్రారంభమైన రోజు నుండి కేవలం బ్యాంకుల కోసం ఓ బానిసై బ్రతుకుతున్న డాక్టర్లను ఎంతో మందిని చూస్తున్నాము. 👆EMI రోజువారీ టార్గెట్లు పెట్టుకొని సంపాదించాలి. ఒక్కరోజు ఫ్యామిలీతో బయటకు వెళ్లినా పేషంట్లు వేరే హాస్పిటల్ దారి పడతారన్న భయం, EMI కట్టలేమన్న భయం. 🤫ఆ భయం కూడా బయటకు చెప్పుకోడానికి వీలుండదు. పేషంట్లు ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కడికీ వెళ్లను అని చెప్పుకోవాలి. 🧒పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్లైపోయారో తెలీదు, ఆశపడి చదివించుకొన్న తలితండ్రులు ఎప్పుడు ముసలివాళ్ళై తన హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారో తెలీదు. 🧜♀️
🤠ఇక ROI(రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్) చూస్తే ఇంతకంటే చెత్త ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి ఉండదు. మనకాడ మెడికల్ ఎడ్యుకేషన్ చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వ కాలేజీల్లో సీట్ వచ్చినా పీజీ అయ్యేటప్పటికి దాదాపు ఓ 50 లకారాలు ఖర్చయినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. 🧑🦼 హాస్పిటల్ కట్టడానికి అయ్యే ఖర్చు అదనం. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏ వ్యాపారం చేసినా ఓ పదేళ్ళలో పూర్తిగా స్థిరపడిపోతాడు. తనకంటూ ఓ ఫ్యామిలీ జీవితం ఉంటుంది.
👉 ఇది నోబుల్ ప్రొఫెషన్ కానీ అందరికీ కాదు. ఆ passion ఉన్నవాళ్లకు మాత్రమే.
👏పెద్ద పెద్ద నగరాల్లో డాక్టరుకు వంగి వంగి నమస్కారాలు పెట్టే రోజులు పోయాయి. కార్పొరేట్ హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లకు రోజువారీ టార్గెట్లు ఉంటాయి. అవి పూర్తిచేయడానికి వాళ్ళు పడే కష్టం అంతాఇంత కాదు. 👉ఇది పూలబాట కాదు.నైపుణ్యాలను పెంచుకుని అందులో ఎదగమని గట్టిగా చెప్పండి.🙌
