👉”చదువుల ముసుగులో కాలేజీల మాయాజాల ఊహల్లో నుంచి బయటకు”
🥵 “ఇరుగును చూసి పొరుగు వాత పెట్టుకోవడం’ అనే సామెత అందరికీ గుర్తుంటుంది. 👉 మా ఊళ్ళో ఇంటర్ MPC గ్రూప్ ;చదవడం, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయడం, సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి లక్షలు సంపాదించడం అనేది అందరి ఆలోచన. 🖥️🖱️అందరికీ చదువు అంటే లక్షలు డబ్బులు సంపాదించే ఒక పెట్టుబడి అనేది మనస్సులో నాటుకుపోయింది. 🕯️అలాంటి మోజులో పడ్డ “రాము మరియు కుటుంబ సభ్యుల జీవిత గాథ” గురించి తెలుసుకుందాం. 🍬రాము ఊరికి దగ్గరలో పట్టణం లో ఒక సాధారణ ప్రవేట్ పాఠశాలలో పదవ తరగతి మంచి మార్కులతో పూర్తిచేసాడు. 🤓మా కాలేజి లో ఇంటర్ చదివితే ఇంజనీరింగ్ సీటు ఖచ్చితం అని పలు కార్పోరేట్ కాలేజీ ల వారు రాము తల్లిదండ్రులను ఉహల్లోకి తీసుక పోవడం మొదలు పెట్టారు. ✊ వ్యవసాయం మీద ఆధారపడిన ఆ కుటుంబం అప్పు చేసి కాలేజీలో చేర్పించారు. 😩 Seat గ్యారంటీ అని చెప్పడంతో కాలేజీ వారు రాము ను చదువూ అంటూ రుద్దడం మొదలు పెట్టారు .🥶 ఆహారం, నిద్ర, స్నానం, ఆటలు మొదలైనవన్నీ రాముతో సంభందం లేకుండా జరిగిపోయాయి. 🙄తల్లి దండ్రులు కూడా అవన్నీ పట్టించుకోకుండా ఊళ్ళో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే వారిలో రామును గుర్తుకు తెచ్చుకుంటూ ఊహల్లో గడుపుతున్నారు.
💻ఎలాగైతేనేమి ఇంటర్ పూర్తి చేసి Eamcet రాసాడు. మంచి ర్యాంక్ సాధించాడు.📱 కౌన్సిలింగ్ జరగక ముందే పలు ఇంజనీరింగ్ కాలేజి ల వారు రకరకాల ఆశలు చూపుతూ మళ్ళీ ఉహల్లోకి పంపడం మొదలు పెట్టారు. భూమి వుందికదా అనే ధైర్యంతో అప్పులమీద అప్పులు చేసి చదివించడం, మా వాడు ఉద్యోగం చేసి తీరుస్తాడులే అని మళ్ళీ ఉహల్లోకి వెళ్లడం తమవంతు అయింది.
💻కాంపస్ సెలక్షన్స్ జరిగాయి. ఉద్యోగం వచ్చింది. 😁రాము మరియు కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. అందరికీ చెప్పడం మొదలు పెట్టారు. ఒక వారం గడిచిన తరువాత అసలు ట్విస్ట్ మొదలయింది. 😧నీకు కావలిసినంత నైపుణ్యాలు లేవు. డబ్బు కడితే నీకు ట్రైనింగ్ ఇప్పిస్తాము. ఆ తరువాత ఉద్యోగంలో కొనసాగవచ్చు అని కంపెనీ వారు చెప్పారు. అప్పు చేయడానికి అవకాశం లేక భూమిని అమ్మి ట్రైనింగ్ ఇప్పించారు. 😵ట్రైనింగ్ అయిపోయే సమయానికి ఆకోర్సుకు భూమింగ్ తగ్గిందని మరొక కోర్సు చేయమని చెప్పారు. నిరాశ తో రాము తిరిగి ఉరికి వచ్చాడు. తన కోసం చేసిన అప్పులభారంతో రాము మరియు కుటుంబసభ్యులు దొరికిన పనిచేసుకుంటూ వఛ్చిన కూలి తో జీవనం గడుపుతున్నారు.
😠😡🤬🤯రాము కథలో లాగా దేశంలో మార్కెటింగ్ మాయాజాలంలో పడి కొట్టుకుపోతున్న వాళ్లలో పేదలు, చదువుకోనివారు కాదు…. అధికశాతం ఇంజినీరింగ్, బీబీఏ, ఎంబీఏ విద్యార్థులవడం బాధాకరం.
✈️కాలేజీల్లో అడ్మిషన్లు పెంచుకోడానికి వాళ్ళు పిల్లలకు, పేరెంట్స్ కు ఓ రేంజిలో సినిమా చూపిస్తారు. ముఖ్యంగా గత విద్యార్థులు లక్షల్లో తీసుకొంటున్న జీతాల గురించి, వాళ్ళు పనిచేస్తున్నట్టు చెప్పే కంపెనీల గురించి, క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం వచ్చే కంపెనీల గురించి!
☺️😊దీని ప్రభావం పిల్లలు/పేరెంట్స్ మీద చాలా గట్టిగా పడుతుంది. వీళ్ళు చాలావరకు వాస్తవంలోకి రాలేరు.
కాలేజీలో విన్న ఆ డ్రీమ్ జాబ్ కోసం, సొంతఊళ్ళో కనీసం లక్ష రూపాయల జీతంతో రాబోయే ఉద్యోగం కొరకు వేచి చూస్తూనే వయోవృద్ధులు(స్థిర పడకుండానే వృద్ధులైపోవడం) అయిపోతుంటారు.
🙏మీకు తెలిసిన పిల్లల్ని వాళ్ళ తలిదండ్రులను వాస్తవంలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యండి. దొరికిన ఉద్యోగానికి వెళ్లి నైపుణ్యాలను పెంచుకుని అందులో ఎదగమని గట్టిగా చెప్పండి.👏
