🪴వివిధ రకాల కోర్సుల గురించి ఆన్ లైన్ అప్లికేషన్, కౌన్సిలింగ్ పై అవగాహన 🪴
👉ప్రభుత్వం చే నిర్దేశించబడే ప్రక్రియ
- వెబ్ సైట్ లాగిన్ అవ్వడం
- ఫీజ్ ఆన్ లైన్ లో చెల్లించడం
- అప్లికేషన్ పూరించడం
- సర్టిఫికెట్స్ అప్ లోడ్ చేయడం
- ఫొటో, సంతకం అప్ లోడ్ చేసి సరి చూసుకోవడం
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం.
- నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో పరీక్ష రాయడం
- రాసిన పరీక్షల ఫలితాలు తెలుసుకొని ర్యాంక్ కార్డు ప్రింట్ తీసుకోవడం.
👉కౌన్సిలింగ్ ప్రక్రియ
- ఆన్ లైన్ కౌన్సిలింగ్ ఫీజు చెల్లించడం
- సర్టిఫికెట్స్ ఆన్ లైన్ వెరిఫికేషన్ చేయించడం
- ఫీజ్ రీయింబర్స్ మెంట్ కు అర్హత లేదు అని మెసేజ్ వచ్చిన వారు ప్రభుత్వం నిర్దేశించిన హెల్ప్ లైన్ సెంటర్లను సంప్రదించడం.
- ఫీజ్ రీయింబర్స్ మెంట్ కు అర్హత సాధించిన వారు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం.
- కాండిడేట్ పేరు మీద లాగిన్ ID మరియు Password కేటాయించడం జరుగుతుంది.
- కాలేజి లు సెలెక్ట్ చేసుకోవడం కోసం ఆప్షన్ ఎంట్రీ క్యాండిడేట్ లాగిన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
- క్యాండిడేట్ లాగిన్ ద్వారా అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది.
- అలాట్ మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకొని సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ ద్వారా నిర్దేశిత కాలేజికి సమర్పించాలి.
👉ఇలాంటి విషయాలు ఒప్పుకోకండి👎.
- మా కాలేజికి చేరండి అని పోన్లు వచ్చినపుడు.
- ఫీజ్ తక్కువ అని ఒప్పించడానికి చెప్పినపుడు.
- కొన్ని సంస్థల పేర్లు చెప్పి అక్కడ మీకు సీట్లు ఇప్పిస్తానని చెప్పినప్పుడు.
- మా కాలేజి లో చేరడానికి ఎంట్రన్స్ రాయవలసిన అవసరం లేదని చెప్పినపుడు
- వ్యక్తిగత సమాచారమైన ఫోన్ నంబర్, లాగిన్ ID, Password మొదలైనవి ఇవ్వమని ఎవరైనా మిమ్ములను అడిగినప్పుడు.
👍కాలేజీ ఎంపిక లో తీసుకోవలసిన జాగ్రత్తలు
- ఆ కాలేజికి ప్రభత్వ గుర్తింపు ఉందా?
- ఆ కాలేజికి ఫీజ్ రీయింబర్స్ మెంట్ సౌలభ్యం ఉందా?
- ఫ్యాకల్టీ మరియు ల్యాబ్ సౌకర్యాలు బాగున్నాయా?
- క్యాంపస్ సెలక్షన్ లు నిజంగా జరుగుతున్నాయా లేక అబద్దమా?
