నాపేరు బయప రెడ్డి. నేను భవిష్యత్ కౌన్సిలింగ్ సంస్థలో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాను.
కరోనా మహమ్మారి రెండవసారి ప్రవేశించిన సందర్భం లో అనంతపురం జిల్లాలో పరిస్థితులు చాలా ఇబ్బందిగా మారాయి. భవిష్యత్ కౌన్సిలింగ్ టీం ప్రజల పరిస్థితులు చూసి కరోనా బారిన పడిన కుటుంబాల ఆకలి బాధ తీరిస్తే గొప్ప సహాయం అని అనుకున్నాము.
వెంటనే కరోనా బారిన పడిన కుటుంబాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాము. చాలా కుటుంబాలలో తల్లి చని పోయారనో, తండ్రి చని పోయారనో, కుటుంబం అంతా కరోనా బారిన పడినారనో విషయాలు బయట పడ్డాయి.
మేము పరిస్థితులు పూర్తిగా తెలుసుకొని కుటుంబానికి రెండు నెలలకు సరిపడ 3 వేల రూపాయల విలువైన పౌష్టికాహారం తో కూడిన సరుకులు తీయించడం మొదలు పెట్టాము. అవి అందుకున్న కుటుంబాలు చాలా సంతోషించాయి. ఇంటి పరిస్థితులు బయటికి చెప్పుకోలేక, కరోనాతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలను కూడా గుర్తించి పౌష్టికాహారం తో కూడిన సరుకులు అందించాము.
ఈ సందర్భం లో టీం, తమ వివిధ స్నేహాల సహాయంతో జిల్లా అంతా గుర్తించిన కుటుంబాలకు సరుకులు అందించడమైనది. ఈ సమయం లో తోడ్పాటు అందించిన మిత్ర బృందానికి హృదయపూర్వక వందనాలు.
వ్యక్తిగతంగా నాకు సంస్థ పనిలో భాగంగా పని చేస్తున్నప్పటికీ ఈ మహత్తరమైన కార్యక్రమం చేయడం గొప్ప వరంగా భావించాను.
ఏ కుటుంబాలకు అత్యవసరం అని నిర్ణయం తీసుకోవడం లో టీం తో కలిసి చేసిన పనిలో చాలా నేర్చుకున్నాను.
అందులో కొన్ని విషయాలు
- సమస్య తీవ్రత
- కుటుంబ ఆర్థిక పరిస్థితి
- ఆ కుటుంబాలకు ఇతరుల ప్రోత్సాహం
- మిత్రుల సహాయం తీసుకోవడం
- లెక్కాచారాలు చూడడం.
- కమ్యూనికేషన్
