నా పేరు రామాంజ నేయులు. నేను భవిష్యత్ కౌన్సిలింగ్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పని చేస్తున్నాను. కరోనా మహమ్మారి రెండవసారి ప్రవేశించిన సందర్భం లో ప్రపంచం లో మిగతా ప్రాంతాల మాదిరి అనంతపురం జిల్లాలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఒకరిని ఒకరు పలక రించుకోవడానికి, కలవడానికి వీలు లేని పరిస్థితులు తయారు అయ్యాయి. ఇటువంటి సందర్భం లో మా టీం అలోచించి మా దగ్గర వున్న 6వేల మంది విద్యార్థులకు ఫోన్ చేసి పలకరించి పరిస్థితులు కనుక్కుందామని అనుకున్నాము.
అనుకున్న వెంటనే 6 మంది ఫెలోస్ ను ఒక నెల కోసం తాత్కాలిక నియామకం చేసుకొన్నాము. వారికి ఫోన్ చేసే పని అప్పగించాము. వారు చాలా అంకిత భావంతో పని చేశారు. ఈ పని ద్వారా వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నారు, వారిపై వారికి నమ్మకం ఏర్పడింది.
దాదాపు 4 వేల మందితో ఒక నెలలోనే (జూన్) మాట్లాడారు.
చిన్న చిన్న సమస్యలు అధిగమిస్తూ పట్టుదలతో పూర్తి చేసాము.
ఇది ఒక గొప్ప విషయంగా మేము భావించాము.
.ఈ విధంగా ఫోన్ చేసి పలకరించడం తో చాలా మంది సంతోషపడ్డారు. కొందరు తమ బాధలు చెప్పుకున్నారు.
తినడానికి లేదని కొందరు, పలకరించడానికి ఎవరు లేరని కొందరు, హాస్పిటల్ లో బెడ్ దొరకలేదని కొందరు చెప్పారు. మా సంస్థకు వీలైనంతలో సహాయం చేస్తూ వారికి తోడ్పడుతూ వచ్చాము. విద్యార్థుల చదువుల విషయాలు తెలుసుకుంటూ, వారు తిరిగి చదువులు, స్కిల్ సెంటర్ల లో చేరి పరిస్థితులు మెరుగుపరుచుకోవడానికి తోడ్పడుతున్నాము.
ఈ ప్రాజెక్టు ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను, టీమ్ సహకారం చాలా బాగుంది, ప్రణాళికబద్ధంగా చేయడంతో మానసికంగా చాలా కాన్ఫిడెంట్ ఏర్పడింది,
సంతృప్తికరంగా కూడా ఉంది.
